Header Ads

"మంచు" ఫ్యామిలి కి క్షమాపణ చెప్పిన యూత్ స్టార్





యూత్ స్టార్ నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ విషయంలో అచ్చం  అభిమాని లాగే స్పందిస్తుంటాడు నితిన్. పవన్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా అతను చాలా ఆనందంతో  స్పందిస్తుంటాడు. నిన్న కాటమరాయుడుటీజర్ విషయంలోనూ అలాగే చేసాడు . ఇప్పటిదాకా రాయుడులు ఎంతమంది ఉన్నా కాటమరాయుడు ముందు దిగదుడుపే అన్నట్లుగా ఒక ట్వీట్ చేస్తూ.. కాటమరాయుడుటీజర్ లింక్ షేర్ చేశాడు నితిన్. ఐతే ఈ ట్వీట్ మంచు మోహన్ బాబు అభిమానుల్ని హర్ట్ చేసింది.


మోహన్ బాబు పెదరాయుడులాంటి బ్లాక్ బస్టర్ తో పాటు రాయుడుఅనే ఇంకో సినిమా కూడా చేసిన సంగతి అందరికి  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరేమన్నారో ఏంటో కానీ.. నితిన్ కాసేపటికే తన ట్వీట్ డెలీట్ చేసి మోహన్ బాబు అభిమానులకు  క్షమాపణలు చెప్పాడు. తాను ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశంలో ఈ ట్వీట్ చేయలేదని.. ఎవరినైనా భాద కలిగించుంటే  క్షమించాలని అన్నాడు. అతను క్షమాపణలు చెప్పగానే మంచు లక్ష్మి స్పందించింది. క్షమాపణల్ని అంగీకరిస్తున్నామని.. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని మంచు లక్ష్మి  ట్వీట్ చేసింది దీన్ని బట్టి ఆమె నితిన్ ను నేరుగా ఫోన్ చేసి తన ట్వీట్ మీద వార్నింగ్ ఇచ్చింటారని  ఫిలిం నగర్ టాక్ . ఐతే నితిన్ కావాలని ఈ ట్వీట్ చేయలేదని కేవలం పవన్ మీద  అభిమానంతోనే ట్వీట్ చేసానని నితిన్ స్పందించాడు.

ఏది ఏమైనా తప్పుచేయకుండా సారి చెప్పడానికి దైర్యం చేసిన యూత్ స్టార్ కు హ్యాట్సాఫ్. 


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.