Header Ads

103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్న "ISRO"

                                                            

                               

                                "ఇస్రో" వరల్డ్ రికార్డ్...!



చరిత్ర అంటే మాది... చరిత్ర  సృష్టించాలన్నామేమే, చరిత్ర తిరగ రాయాలన్న మేమే, ఈ డైలాగ్ నిజంగా మన దేశానికి నూటికి నూరు శాతం సరిపోతుంది. భారత్ దేశం  అంతా  గర్వించే రోజు రానే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 103 ఉపగ్రాహాలను ISRO"  అంతరిక్షంలోకి పంపి వరల్డ్ రికార్డు సృస్టించనుంది. ఈ ఉపగ్రహాలను ఫిబ్రవరి రెండో వారంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట లోని "సతీష్ స్పేస్ ధావన్ సెంటర్" నుండి ఇస్రో శాస్త్ర వేత్తలు PSLV - C37 అనే రాకెట్ ద్వారా లాంచ్ చేయనున్నారు. వీటిలో 100 విదేశీ ఉపగ్రహాలు కాగా  మూడు మన దేశానివి. ముందుగా అంతరిక్ష సంస్థ జనవరి చివరి వారంలో 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలనుకుంది కానీ ఇంకో 20 విదేశీ ఉపగ్రహాలు కలవడంతో ఈ ప్రయోగం ఒక వారం ఆలస్యం కానుందని ఇస్రో డైరెక్టర్ సోమనాద్ చెప్పారు. యితే, ఈ మిషన్ లో దేశాల సంఖ్య పేర్కొనలేదు, కానీ యునైటెడ్ స్టేట్స్ మరియు జర్మని లాంటి దేశాలు ఉన్నాయని చెప్పారు. పేలోడ్ బరువు 1350 కిలోలు ఉంటుంది దానిలో 500-600 కిలోల ఉపగ్రహ యొక్క బరువు ఉంటుందని "మిస్టర్ సోమనాథ్ జోడించారు. కాగా గత ఏడాది ఇస్రో రికార్డ్ స్థాయిలో 20 ఉపగ్రాహాలను ప్రయోగించినట్టు అందరికి తెలిసిందే. ఇప్పటివరకు అత్యాదికంగా రష్యా 37 ఉపగ్రహాలను, అమెరికా "నాసా" ద్వారా 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఇప్పుడు భారత్ 103 ఉపగ్రహాలను  అంతరిక్షంలోకి పంపి వరల్డ్ రికార్డు సృస్టించింది. 
ఒక సినిమా వార్త షేర్ చేయడం వలనా ఆ సినిమా నిర్మాత కి డబ్బులు వస్తాయి. అదే ఇలాంటి వార్త షేర్ చేస్తే మన దేశానికి పేరు వస్తుంది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసి మన దేశ ఐక్యతను పెంచండి.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.