Header Ads

కాటమరాయుడు రీ షూట్‌కు పవర్ స్టార్ ఆర్డర్!!

‌పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ దాదాపు పూరైంది. సినిమాలో తన పార్టు షూటింగ్ను పవర్ స్టార్ పూర్తి చేసేశాడు. దీంతో మార్చి 24న సినిమాను విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యాడు చిత్ర నిర్మాత శరత్ మరార్. అయితే.. ఈ సినిమా విడుదలకు ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కే ‘రీ షూట్’. ఆ రీ షూట్ను ఆర్డర్ చేసింది కూడా స్వయానా పవర్ స్టార్. అమెరికా పర్యటన నుంచి వచ్చిన పవన్ కల్యాణ్.. సినిమా ఫస్ట్ కాపీని చూశాడట. అయితే అందులో కొన్ని సన్నివేశాలు అనుకున్నట్టు బాగా రాలేదని భావించాడట. దీంతో మరో మాట లేకుండా రీ షూట్ చేసేయాలని చిత్ర యూనిట్కు పవన్ ఆర్డర్ వేసేశాడని టాక్. మరో రెండు రోజుల పాటు బాగా రాని ఆ సన్నివేశాలను రీ షూట్ చేయాలని చెప్పాడట పవన్ . దానికి తగినట్టు హీరోయిన్ శ్రుతి హాసన్ సహా ఇతర నటీనటుల డేట్లను తీసుకోవాలని చెప్పాడట. పవర్ స్టార్ అయితే వారి డేట్లు దొరకడం కష్టతరమంటోందట చిత్ర బృందం. అయినా సరే.. ఎలాగోలా వారి డేట్లను సంపాదించి రీ షూట్ చేయాల్సిందేనని పవన్ కళ్యాణ్ అంటున్నాడట. మరి, పవన్ అన్నట్టు రీ షూట్కు వారి డేట్లు దొరుకుతాయా? రీషూట్ అనుకున్న టైంకు పూర్తై.. అనుకున్న తేదీకి సినిమా విడుదలవుతుందా? లేదా అన్నదే సందేహంగా మారిందట చిత్ర యూనిట్కు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.