Header Ads

జగన్ పై నిప్పులు చెరిగిన "చంద్రబాబు"

                 

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు  నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీనితో ఏపీ లో ఉన్న టి.డి.పి నేతలకు రెట్టింపు  ఉత్సాహం వచ్చినట్లైంది. ప్రతిపక్ష నేత జగన్ కు కూడా అక్రమాస్థుల కేసులు ఉండడంతో ఆయనకుకూడా శిక్ష తప్పదని టిడిపి నేతలు నేతలు తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం లో ఏర్పాటు చేసిన టిడిపి కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. రూ 66 కోట్ల అవినీతికి నాలుగేళ్లు జైలు శిక్ష అయితే..లక్ష కోట్లు దోచుకున్నజగన్ కి  ఎన్నేళ్లు శిక్ష పడుతుంది..? అని చంద్రబాబు సమావేశంలో  ప్రశ్నించారు.

             టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు . చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న విషయం నేడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో స్పష్టం అయిందని అన్నారు.రూ 66 కోట్ల అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళకే నాలుగేళ్లు జైలు శిక్ష పడితే, భారీస్థాయిలో 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ కు ఎలాంటి శిక్ష పడుతుందో ఊహించుకోవాలని బోండా ఉమా మీడియాతో పలు సంచలనాత్మక వాక్యాలు చేసారు. మరి దీనిపై జగన్ ఏ మేరకు స్పందిస్తారో చూద్దాం.


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.