Header Ads

ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు


ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు



కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు నేటితో ముగిసింది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై చివర వరకు ఉత్కంఠ నేపథ్యంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సంఖ్యాబలం తక్కువ ఉన్నందున వైసీపీ ఈ ఎన్నిక నుంచి తప్పుకుంది. టీడీపీ అభ్యర్ధి ప్రభాకర్ కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఐతే  ప్రభాకర్ తో పాటు బీఎస్పీ అభ్యర్ధి దండు శేషు యాదవ్, స్వతంత్ర అభ్యర్ధులు నాగిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 29వరకు గడువుగా నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే నెల 12న జరగనుండగా...అదే నెల 16న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా టీడీపీకు ఎక్కువగా మెజరిటీ ఉన్న నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.