Header Ads

రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం


రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశ్వాపూర్ హెచ్ పీసీఎల్ సమీపంలో బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మ్రుతి చెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే రాజు, యాకయ్య ఇద్దరు వ్యక్తులు నగరం నుంచి జనగాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.