Header Ads

ప్రత్యేక హోదాపై పార్టీల తీరు ఎలా ఉంది ?


ఒక రాష్ట్రం ఆర్థికంగా వెనక బడి పోతే ప్రత్యేక హోదా ద్వారా నిధులు గ్రాంట్ చేసి ఆ రాష్ట్రాన్ని ఆదుకుంటారు. దీన్నే ప్రత్యేక హోదా అంటారు. ఇది సరిగ్గా వాడుకుంటే మన రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో  ఎటువంటి అవినీతి లేకుండా సద్వినియోగం చేసుకుంటే ఆ రాష్ట్రం సింగపూర్ లాగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని  తెలంగాణా నుండి ఆంధ్రాను విడదీసే సమయంలో నాటి ప్రతి పక్షం  NDA , అధికార పక్షం పై  ఒత్తిడి  తేవడంతో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు.  కాని  ఇప్పుడు మాట తప్పారు. అప్పుడు అధికార పక్షం పై ఒత్తిడి   తెచ్చిన ప్రతి పక్షం NDA నే నేటి అధికార పక్షం కాబట్టి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని తేల్చి చెప్పారు. ఒకప్పుడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రాకు ప్రత్యేక హోదా  5 ఏళ్ళు సరిపోదని కనీసం 15 ఏళ్ళు అయినా ఇవ్వాలని డిమాండ్ చేసారు. కానీ ఇప్పుడు మాట తప్పడమే కాకుండా కేంధ్రంతో చేతులు కలిపి తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు. ఇక తెలుగు దేశం పార్టీ సంగతి కూడా అంతే  ఒకప్పుడు ప్రత్యేక హోదా తెస్తానని మ్యాన్ ఫెస్టోలో పెట్టి ఇప్పుడు హోదా వద్దని ప్యాకేజి చాలు అని చంద్రబాబు తేల్చి చెప్పేసారు. కారణం నోటుకు ఓటు కేసుల భయం. ఇది ఇలా ఉంటే జనవరి 26 న జరిగిన ప్రత్యేక హోదా యువభేరిలో టీడీపీ పార్లమెంట్ లీడర్ సుజనా చౌదరి కూడా ప్రత్యేక హోదా ఎవడికి ఉపయోగంలేదని ద్దేవా చేశారు. ఇక జనసేన పార్టీకు వస్తే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ట్విట్టర్ లో తప్ప ఇంకా ఎక్కడ నోరు మెదపడం లేదు. ఇక వైఎస్ఆర్ పార్టీకు వస్తే ప్రత్యేక హోదాపై  ఎంతో కొంతో కేంద్రంతో పోరాడుతుంది అంటే అది జగన్ అనే చెప్పాలి.  ఒక విధంగా చెప్పాలంటే టి.డి.పి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేసిందనే చెప్పాలి.


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.