Header Ads

యూత్ స్టార్ తో కె.కె. రాధామోహన్ భారీ చిత్రం


"అఆ" సినిమా తో బారి విజయాన్ని సొంతం చేసుకుని హీరో నితిన్ మంచి ఉపుమీద ఉన్నాడు. ఐతే ఇప్పుడు నిర్మాత కె.కె. రాదా మోహన్  నితిన్ తో బారి సినిమాని నిర్మించనున్నాడు‌ ఏమైంది ఈవేళ,  ఇంకా బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన  నిర్మాత కె.కె.రాధామోహన్ మరో భారీ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''నితిన్ తో ఓ సూపర్హిట్ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాం అన్నారు. ఐతే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, చేస్తుండగా మరో కొత్త దర్శకుడు కృష్ణచైతన్య డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్ట్ తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది అన్నారు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము'' అన్నారు అయన. మరి చూదాం నితిన్ ఈ చిత్రం తో మరో హిట్ కొడతాడో లేదో...!

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.