ధోనిని ట్రోల్ చేసిన హర్ష గోయంకా
మహేంద్ర
సింగ్ ధోని పైన పూణే ఓనర్ సంజయ్ గోయంకా కుమారుడు హర్ష గోయంకా తీవ్ర విమర్శలు
చేసాడు. ముంబై పైన పూణే ను గెలిపించిన స్టీవెన్
స్మిత్ ను పొగిడి ధోనిని యద్దేవా చేసాడు.
ముంబైపై గెలిచినా అనంతరం హర్ష “అడవిలో రాజు ఎవరో ఇప్పుడు తెలిసింది రాజంటే స్టీవెన్
స్మిత్ లా ఉండాలి కెప్టన్ అంటే స్మిత్ లా
ఉండాలి మేము సరైన కెప్టన్ ను ఎంచుకున్నదుకు చాల ఆనదంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. ఈ
ట్వీట్ చూసిన ధోని అభిమానులు హర్షపై విరుచుకుపడ్డారు మా వల్లే పూణేకు అభిమానులు
ఉన్నారని లేకుంటే పూణే చిట్ట చివరగా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేయగా దానికి రిప్లయ్ గా హర్ష ధోని IPL గణాంకాలు
చూపించి మల్లి ధోనిని విమర్శించాడు. ఏది ఏమైనా చెన్నై సూపర్ కింగ్స్ కు రెండు సార్లు కప్పు అందించడం లో కీలక పాత్ర
పోషించిన ధోనిని ఇలా పూణే యాజమన్యం
విమర్శించడం సరికాదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
No comments
Please Comment and Share