Header Ads

అటెండర్ దగ్గర నుండి జిల్లా కలెక్టర్ వరకు ఎవరైనా సరే..!


మన దేశంలో  యోగి అదిత్యానాద్  పేరు తెలియని మనిషే లేడు. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా  బాద్యతలు చేపట్టిన ఈయన  ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని ఉత్తర ప్రదేశ్ ప్రజల్లో దేవుడు అయ్యారు. ఈయన రాకతో గూండా రాజ్యం కాస్త ప్రశాంతత రాజ్యంగా తయారయ్యింది. ఎన్నో సంచలనాలకు తెర లేపిన యోగి తాజాగా ఒక ప్రయోగాత్మక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టించాడు. అది ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అటెండర్ దగ్గర నుండి జిల్లా కలెక్టర్ దాకా  ప్రభుత్వ  ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలి లేకుంటే ఇంక్రిమెంట్లు, బోనస్ లు , ప్రమోషన్లు ఇవేవి ఉండవని చెప్పేసాడు. ఏది ఏమైనా యోగి తీసుకున్న నిర్ణయం సరైనదని సోషల్ మీడియా లో నెటిజన్లు  తెగ హల్ చల్ చేస్తున్నారు. 

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.