Header Ads

2019 ఎన్నికల్లో పవన్ ఎవరితో కలిసి పోటీ చేస్తారు ?


పవన్ కళ్యాణ్ స్థాపించిన కొత్థ పార్టీ "జనసేన". పవర్ కోసం కాదు ప్రశించడం కోసం అనే నినాదంతో ఈ పార్టీ ని స్థాపించారు. 2014 లో పవన్ పార్టీ పూర్తిగా నిర్మాణం కాకపోవడంతో తెలుగు దేశంతో పాటు భారతీయ జనతా పార్టీ కి మద్దతుగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇపుడు ఎన్నికలు జరిగి 3 ఏళ్ళు గడిచినా జనసేన ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. ఇంతలోనే ప్రెస్ మీట్ లో తాను అనంతపురం నుండి పోటీ చేస్తున్నాని  స్టేట్ మెంట్ ఇచ్ఛేసాడు. దీనితో 2019 ఎన్నికల్లో సరికొత్త్త మలుపు తిరగనుంది.  2019 లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేదా వేరే పార్టీ తో కలిసి పోటీ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం అనంతపురం జిల్లాలో పవన్ కు తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా  పవన్  కు అభిమానులు కొన్ని వేల  టన్నుల్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పవన్ కు తిరుగులేనట్టే. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 15 నుండి 30 సీట్ల మధ్య గెలుచుకోవచ్చ్చని తాజా సర్వే  తెలిపింది. ఒకవేళ ఒంటరిగా కాకుంటే వేరే పార్టీ తో కలిసి చేయాలనుకుంటే ఎవరితో చేస్తారనే విషయం ఇంకా తేలనుంది .  తాజా పరిణామాలబట్టి చూస్తే పవన్ జగన్ తో కలిసి పోటీ చేస్తారని ఆంధ్రా లో గుస గుస లు వినబడుతున్నాయి. దీనికి తోడు తాజాగా వైకాపా ఎంపీ లపై  పవన్ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించడం, టీడీపీ ఎంపీ లపై విమర్శలు చేయడం వలన  పవన్ జగన్ తో పోటీ చేస్తారని సోషల్ మీడియాలో  టాక్ నడుస్తుంది . మరి చూద్దాం పవన్ పాత్ర 2019 ఎన్నికల్లో ఈమేరకు ఉంటుందో !

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.